01-12-2025 10:44:42 PM
అశ్వారావుపేట (విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గంలో రెండవ రోజు భారీగా నామినేషన్లు పడ్డాయి. నియోజకవర్గంలోని ఐదు మండలాలలో సర్పంచ్ పదవికి 157 నామినేషన్లు వేసారు. వార్డు సభ్యులకు 538 నామినేషన్లు పడ్డాయి. మండలాలవారీగా ఇలా ఉన్నాయి. అశ్వారావుపేట మండలంలో సర్పంచ్ కి 42 నామినేషన్లు, వార్డు సభ్యులకు 107 నామినేషన్లు పడ్డాయి. చండ్రుగొండ మండలంలో సర్పంచ్ కి 28. వార్డు సభ్యులకు 103 నామినేషన్లు వచ్చాయి.
ములకలపల్లి మండలంలో 28 నామినేషన్లు సర్పంచ్ లకు, 84 వార్డు సభ్యులకు నామినేషన్లు నమోదు అయ్యాయి. దమ్మపేట వ మండలంలో 46 మంది సర్పంచ్లకు, 152 నామినేషన్లు వార్డు సభ్యులకు వేసారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో సర్పంచ్ కు13 వార్డు సభ్యులకు 92 నామినేషన్లు పడ్డాయి. సోమవారం నామినేషన్లు వేయడానికి భారీగా తరలిరావడంతో పలు మండలాలలో రాత్రి పొద్దుపోయే వారకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. నామినేషన్ కేంద్రాల పరిసరాలలో వివిద పార్టీలకు చెందిన వారు, అభ్యర్థుల మద్దతుదారులు భారీగా చేరారు.