calender_icon.png 2 December, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో కోవాసెంట్ కొత్త ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం

01-12-2025 11:34:06 PM

ఏఐ ఇన్నోవేషన్ సెంటర్లకు హైదరాబాద్ చిరునామాగా మారుతోంది. కోవాసెంట్ టెక్నాలజీస్ హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ టెక్ పార్క్ లో తన కొత్త ఏఐ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇన్నోవేషన్ సెంటర్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్ & లెజిస్లేటివ్ అఫైర్స్ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు గారు ప్రారంభించారు. డల్లాస్, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, లండన్ & దుబాయిలో ఉన్న గ్లోబల్ కార్యాలయాలతో పాటు, ఈ కొత్త సెంటర్ ఏజెంటిక్ ఏఐ స్వీకరణకు ప్రత్యేకంగా సిద్దం చేశారు, ఎంటర్‌ప్రైజ్‌లు విశ్వసనీయమైన గార్డ్‌రైల్స్‌తో ఏజెంటిక్ ఏఐ పరిష్కారాలను భారీ స్థాయిలో అమలు చేయడంలో ఇది సహాయపడుతుంది.

గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్‌ల కోసం క్లిష్ట వ్యాపార సమస్యలను పరిష్కరించేందుకు స్వయంచాలక ఏజెంటిక్ ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడంపై ఈ సెంటర్ దృష్టి సారిస్తుంది.  ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్, ఐఏఎస్ ఐటి సలహాదారు సాయి కృష్ణ , పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా నగరాలు కృత్రిమ మేధస్సు యుగాన్ని నడిపేందుకు పోటీ పడుతున్నాయినీ, హైదరాబాద్ మాత్రం భిన్నమైన మార్గాన్ని ఎంచుకుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.రాబోయే సంవత్సరంలో, అడ్వాన్స్‌డ్ ఇంజనీరింగ్ సెంటర్‌ల పెరుగుదలతో పాటు ఏఐ మరియు సైబర్‌సెక్యూరిటీలో ప్రత్యేక పాత్రలు విస్తరిస్తాయని తెలిపారు. 

కోవాసెంట్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ఈ వేగాన్ని మరింత బలోపేతం చేస్తుందనీ,. ఇది గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎంటర్‌ప్రైజ్ స్థాయి ఏఐ డెవలప్‌మెంట్‌ను ఒకే ఎకోసిస్టమ్‌లోకి తీసుకొస్తుందన్నారు. హైదరాబాద్ ఇకపై కేవలం టెక్నాలజీ హబ్ మాత్రమే కాదనీ, ఇది ఏఐ కమాండ్ సెంటర్‌గా, ప్రపంచ ఉత్పత్తులు రూపొందే స్థలంగా ,భద్రమైన, బాధ్యతాయుతమైన ఏఐ భవిష్యత్తును నిర్మించే కేంద్రంగా మారుతోందన్నారు. ఏజెంటిక్ ఏఐ శక్తివంతమైన సామర్థ్యంగా అభివృద్ధి చెందుతోందనీ, ఏఐ ఇన్నోవేషన్ సెంటర్‌ను సృష్టించడం ద్వారా, తమ కస్టమర్‌లకు ఏఐ ఏజెంట్లను అన్వేషించేందుకు, ప్రయోగాల నుండి వ్యాపార ప్రభావం వైపు ప్రయాణించేందుకు కీలకం కానుందని కోవాసెంట్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ సివి సుబ్రమణ్యం చెప్పారు. కోవాసెంట్ కొత్త ఏఐ ఇన్నోవేషన్ సెంటర్, ఎంటర్‌ప్రైజ్‌లు ఏజెంటిక్ ఏఐ ని సురక్షితంగా, స్కేల్‌లో స్వీకరించడం ద్వారా పోటీదారులపై ప్రయోజనం పొందేందుకు ప్రత్యేకంగా రూపొందించారు.