calender_icon.png 2 December, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో రోజు నామినేషన్ల ఊపు..

01-12-2025 11:06:18 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో రెండో రోజు సోమవారం నామినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. నియోజకవర్గలో నామినేషన్లు పోటాపోటీగా వేశారు. మండలాల వారీగా నామినేషన్లు దాఖలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి మండలంలో 17 జీపీఎస్ లకు 46 పడగా మొత్తం 57 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 156 వార్డులకు గాను 134 పడగా మొత్తం 140 దాఖలు అయ్యాయి. కన్నెపల్లిలో 15 జీపీలకు 30 కాగ మొత్తం 36 దాఖలు, 130 వార్డులకు 87 కాగా మొట్టం 88 వేశారు. బీమినీ మండలంలో 12 జీపీలకు 28 కాగా, మొత్తం 30 దాఖలు అయ్యాయి.

100 వార్డులకు 70 నామినేషన్లు పడగా మొత్తం నామినేషన్లు 74 దాఖలు అయ్యాయి. వేమనపల్లిలో 14  జీపీలకి 35 వేశారు. 118 వార్డులకు 73 దాఖలయ్యాయి. నెన్నెల్లో 19 జీపిలకు 48 పడగా మొత్తం 53 వేశారు. 158 వార్డులకు 131 పడగా మొత్తం134  నామినేషన్లు వేశారు. తాండూరులో 15 జీపీలకు 45 వేయగా మొత్తం 53 దాఖలు అయ్యాయి. 144 వార్డులకు 142 నామినేషన్లు పడగా మొత్తం 152 నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాసిపేటలో 22 జీపీలకు 32 కాగా మొత్తం 35 పడ్డాయి. 190 వార్డులకు 70 నామినేషన్లు దాఖలు కాగా మొత్తం 75 నమోదు అయ్యాయి.