calender_icon.png 1 December, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిలిచిన పత్తి కొనుగోళ్లు.. రోడెక్కిన రైతులు.!

01-12-2025 10:59:13 PM

తెలకపల్లి మండలం చిన్న ముద్దునూర్ కాటన్ మిల్ వద్ద ఘటన..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): రైతులు పండించిన పత్తి పంటను అమ్ముకునేందుకు తీసుకువస్తే తేమ తరుగు పేరుతో మిల్లు వద్ద మిల్లర్లు కొనుగోళ్లు నిలిపివేయడాన్ని నిరసిస్తూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తెలకపల్లి మండలం చిన్న ముద్దునూరు వద్ద ఉన్న కాటన్ మిల్ నిర్వాహకులు రైతుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో మండిపడ్డారు. అర్ధాంతరంగా పత్తి కొనుగోలు నిలిపివేయడంతో రోడ్డుపై బైఠాయించి రైతులు రాస్తారోఖో చేపట్టారు. దీంతో కొద్దిసేపు వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు పత్తి కొనుగోలు యధావిధిగా జరుపుతామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.