జూరాలలోకి వరద నీరు
22-08-2026 12:00 AM
దిగువకు 38,149 క్యూసెక్కుల విడుదల
గద్వాల, ఆగస్టు 21 (విజయక్రాంతి): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద స్వలంగా పెరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గం టలకు ప్రాజెక్ట్‌లోకి 47,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు వె ల్లడించారు. కాగా 38,149 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నీటిని ఎత్తిపోతల పథకాలు, జూరాల కు డి, ఎడమ కాల్వలకు తరలిస్తున్నారు. ఎ గువ రాష్ట్రమైన కర్ణాటకలోని ఆల్మట్టి జ లాశయంలోకి వరద నీరు చేరడంతో దాన్ని దిగువకు వదులుతున్నారు. అక్క డి నుంచి నారాయణపూర్ జలాశయంలోకి నీరు చేరడంతో అక్కడి నుంచి వద లిన నీరు జూరాలలోకి వచ్చి చేరుతుంది.






