పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకోవద్దు
జీఓ 97ను వెంటనే రద్దు చేయాలి...
మాజీ ఎంఎల్‌ఏ దివాకర్ రావు
నస్పూర్, ఆగస్టు 21: కాంగ్రెస్ ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోందని, వారి భవిష్యత్తుతో ఆడుకోవద్దని మాజీ ఎంఎల్‌ఏ దివాకర్ రావు పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి విభాగం యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 97ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులు, మంచిర్యాల నియోజకవర్గం బిఆర్‌ఎస్వీ మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షుడు దగ్గుల మధుకుమార్ ఆధ్వర్యంలో నస్పూర్ సీసీసీ కార్నర్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలిపి బీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ తో కలిసి ఆయన మాట్లాడారు.
పదో తరగతి పూర్తయిన తర్వాత పాలిటెక్నిక్ కోర్సులు చదివి త్వరగా ఉద్యోగాలు పొందే అవకాశాలున్నాయ, అలాంటి ఉపాధి ఆధారిత కోర్సులను రద్దు చేసే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులను ఐటీఐ విద్యార్థుల మాదిరిగా చూడకుండా, వారి విద్యా భవిష్యత్తును కాపాడాలని కోరారు. విద్యార్థులకు ఉపయోగపడే పాలిటెక్నిక్ విద్యను మరింత బలోపే తం చేయాల్సింది పోయి నిర్వీర్యం చేయడం సరికాదన్నారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి గుర్తింపు తీసుకురావడం కోసం పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఇప్పటికే ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద ని, వరుస నిర్ణయాలతో విద్యార్థుల భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టవద్దన్నారు. పా లిటెక్నిక్ విద్యను కాపాడేందుకు విద్యార్థుల పక్షాన బీఆర్‌ఎస్వీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్వీ నాయకులు నక్క తిరుపతి, ఎర్రోళ్ల నరేష్, ఎండీ నాయబ్, శ్రీకాంత్, బీఆర్‌ఎ స్త్వ్ర నియోజకవర్గ అధ్యక్షుడు కాటం రాజుకుమార్, చెన్నూర్ నియోజక వర్గ యువ నా యకులు ఎస్డీ జాకీర్, గోగర్ల శివ, కందుల ప్రశాంత్, సాజిద్, నస్పూర్ పట్టణ అధ్యక్షు డు అకూరి సుబ్బన్న, వంగ తిరుపతి, మెరు గు పవన్, టిబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్రెడ్డి, మాజీ కౌన్సిలర్ హైమద్, కార్పొరేటర్ గుమ్మడి శ్రీను, పానుగంటి శ్రీను, పొగాకు రమేష్తో పాటు పలువురు నా యకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






