08-11-2025 08:54:08 AM
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగం అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ మాజీ సభ్యుడైన రెడ్డి, దశాబ్ద కాలం టీడీపీతో పనిచేసిన తర్వాత 2017 లో కాంగ్రెస్‌లో చేరారు. "తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను" అని మోడీ ఎక్స్ లో లో పోస్ట్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న దూరదృష్టి గల ప్రజా నాయకుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ లో పోస్టు చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Bengal CM Mamata Banerjee) కూడా రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. రేవంత్ రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూరు మండలం, కొండారెడ్డిపల్లి గ్రామంలో 1969 నవంబర్ 8న జన్మించారు. ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యారు.