23-07-2025 12:59:36 AM
ఉప్పల్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్
ఘట్ కేసర్, జూలై 22 : ఉప్పల్ ఆర్టీసీ బస్ డిపో నుంచి ప్రత్యేక ప్యాకేజీ టూర్స్ ను ప్రారంభించడం జరిగిందని డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఘట్ కేసర్ బస్ టెర్మినల్ వద్ద ఆయన మాట్లాడుతూ ఉప్పల్ ఆర్టీసీ బస్సు డిపో నుంచి సెలవు దినాలతో పాటు శని, ఆదివారం రోజులలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో గల దేవస్థానాలు, పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీతో ఆర్టీసీ బస్సులను నడపడం జరుగుతుందన్నారు.
ఉదాహరణకు వరంగల్ జిల్లా ప్రత్యేకత టూర్ లో ఉప్పల్ చౌరస్తా నుండి ఉదయం 6 గంటలకు బస్సు బయలుదేరి మొదట రామప్ప టెంపుల్, లక్నవరం, భద్రకాళి టెంపుల్, వేయి స్తంభాల గుడి, స్వర్ణగిరి టెంపుల్ అనంతరం రాత్రి 10:30 కు ఉప్పల్ చౌరస్తా కు చేరుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకుగాను పెద్దలకు రూ. 900 పిల్లలకు రూ. 450 ప్యాకేజీ రేటుగా నిర్ణయించడం జరిగిందన్నారు.
ప్రత్యేక ప్యాకేజ్ టూర్ లో కాలేశ్వరం టూర్ కు పెద్దలకు రూ. 1200 పిల్లలకు రూ. 700, వికారాబాద్ టూర్ కు రూ. పెద్దలకు రూ. 640 పిల్లలకు రూ. 400, జోగులాంబ టూర్ కు పెద్దలకు రూ .1130, పిల్లలకు రూ. 700, యాదగిరిగుట్ట టూర్ కు పెద్దలకు రూ. 500, పిల్లలకు రూ. 300, శ్రీశైలం టూర్ కు పెద్దలకు రూ. 1450, పిల్లలకు రూ. 840, అరుణాచలం టూర్ కు పెద్దలకురూ. 3900, పిల్లలకు రూ. 3300, వేములవాడ టూర్ కు పెద్దలకు రూ. 1080, పిల్లలకు రూ. 650 రేట్లను నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఆసక్తి గల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ శ్రీనివాస్ కోరారు.