calender_icon.png 3 January, 2026 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్మేసిన మంచు పొరలు

03-01-2026 10:41:46 AM

వాంకిడి (విజయ క్రాంతి): మండల కేంద్రమైన వాంకిడిలో శనివారం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 10 గంటల వరకు మంచు పొరలు వీడకపోవడంతో పలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టపగలే లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్–నాగపూర్ జాతీయ రహదారి దట్టమైన పొగమంచుతో కమ్ముకుపోయింది. దగ్గరకు వచ్చే వరకు ఎదురుగా ఎలాంటి వాహనం వస్తుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.