calender_icon.png 4 January, 2026 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెనిజులాలో భారీ పేలుళ్ల

03-01-2026 02:03:34 PM

కరాకస్: వెనిజులా రాజధాని కరాకస్‌లో వరుస పేలుళ్లు(Venezuela explosions) సంభవించాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో అనేక భవనాలు మంటల్లో కాలిపోవడం కనిపించింది. దట్టమైన పొగ వ్యాపించింది. స్థానిక సమయం ప్రకారం తెల్లవారుజామున 2:00 గంటల ప్రాంతంలో ఏడుచోట్ల భారీ శబ్దాలతో పేలుళ్లు వినిపించాయి. ఉత్తర వెనిజులాలోని మిరాండాలో ఉన్న హిగ్యురోటే విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు శబ్దం వినిపించిందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. పేలుళ్ల నేపథ్యంలో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. డ్రగ్స్ అక్రమరవాణా విషయంలో వెనెజువెలాను అమెరికా టార్గెట్ చేసింది. డ్రగ్స్ తరలిస్తున్న పడవలపై అమెరికా దాడులు ముమ్మరం చేసింది. డ్రగ్స్ సరఫరాకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ సహకరిస్తున్నారని అమెరికా ఆరోపించింది. అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వెనెజువెలాను హెచ్చరించారు.