calender_icon.png 4 January, 2026 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా చైతన్యమూర్తి సావిత్రి బాయి పూలే

03-01-2026 02:38:51 PM

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు

 హాజరైన కూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి

మహబూబ్ నగర్ టౌన్ : ఆధునిక భారత దేశ చరిత్రలో తిరగరాసి ఎంతో మంది మహిళలకు పునర్జన్మను ప్రసాదించి  ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్యమూర్తి, సామాజిక ఉద్యమకారిణి సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓబీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు బండి మల్లేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ యాదవ్, సీనియర్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి, సీజే బెనహర్  గ్రంథాలయం చైర్మన్ మల్లు నరసింహారెడ్డి కంచె లక్ష్మణ్, నవనీత గసీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.