03-01-2026 01:30:25 PM
అంబర్ పేట లో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబరీ పేట్ గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ ఆరుట్ల కవిత అనిల్, ఉప సర్పంచ్ రంగోలి సత్య గౌడ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి శనివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా మహిళల విద్య కోసం కృషి చేస్తూ ఎన్నో పాఠశాలలు, సామాజిక సేవలు చేశారని కొనియాడారు.
ఆమె త్యాగాలు పై భారత దేశ చరిత్రలో మహిళ ఉద్యమరాలుగా బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఆమె అడుగుజాడల్లో భావికారాలు మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పద్మ , కరోబార్ కిషన్ రావు, నిమ్మ లావణ్య, రంగు ఈశ్వర్ గౌడ్, నీల దేవరాజు, రంగోలి సత్య గౌడ్, నిఖిత, ఫిరంగి అశోక్, చంద్రారెడ్డి, అమరేందర్, భూసపురం కవిత, దేవునిపల్లి పూజిత, నిమ్మ దేవవ్వ, పిట్ల స్వామి, జెడ్ పి హెచ్ ఎస్ ప్రైమరీ ఉపాధ్యాయురాలు, ఐకెపి, అంగన్వాడి సిబ్బంది, గ్రామస్తులు, నాయకులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.