03-01-2026 02:34:43 PM
సుల్తానాబాద్ ను కమ్మేసిన పొగమంచు..
పెద్దపల్లి: మంచు కొండల్లో ఉన్నట్టుగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ను శనివారం పొగ మంచు కమ్మేసింది. ఎన్నడూ లేని విధంగా పొగ మంచు కప్పుకపోవడంతో ప్రజలతోపాటు వాహనదారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు, గత నాలుగు రోజులు గా చలి తీవ్రత కొంత తగ్గింది. ఉదయం 8:30 గంటల వరకు కూడా మంచు తెరలు విడలేదు.. సూర్యుడు రాలేదు, రోడ్లపై వెళ్లే వాహనదారులు పొగ మంచులో లైట్లు వేసుకొని వెళ్లే పరిస్థితి ఏర్పడింది, రాజీవ్ రహదారి పొడవునా పది అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించక పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
గతంలో ఎన్నడు చూడని విధంగా కాశ్మీరును తలపించే విధంగా పొగ మంచు కొమ్ముకోవడం ఇదే మొదటిసారి అని ప్రజలు చర్చించుకున్నారు... పొగమంచు కారణంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని డాక్టర్లు చెబుతున్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం వాకింగ్ చేసే సమయంలో పక్క పక్కన ఉన్న కానీ వేరే వారు కనబడలేదు. మొత్తం మీద ఈ పొగ మంచు ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేసింది....