03-01-2026 02:32:21 PM
తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో గత రెండున్నర సంవత్సరాలుగా ఉద్యోగరీత్యా ఎస్ఐ శివానందం తన యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ మున్సిపల్ మరియు మండల ప్రజల అభిమానాన్ని చురగొన్నారు. అయితే తను బదిలి కావడం జరిగింది. తిరిగి తన ఉద్యోగ బాధ్యతలను మెదక్ లోని ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక ఉద్యోగశాఖ లో వెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా సిఐ. రమ్యకృష్ణ ఎస్సై శివానందం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తూప్రాన్ ఇన్చార్జి ఎస్సైగా బాధ్యతలను ఎస్సై2 జ్యోతి స్వీకరించడం జరిగింది.