calender_icon.png 25 May, 2025 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి

21-05-2025 12:00:00 AM

మెయిన్ రోడ్డు ఇరువైపులా దుకాణదారులకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ 

కల్లూరు, మే20 (విజయక్రాంతి)ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే ప్రమాదాలను కచ్చితంగా నివారించవచ్చని కల్లూరు ఎస్త్స్ర డి హరిత తెలిపారు. మంగళవారం పట్టణం లో ప్ర ధాన రహదారి ఇరువైపుల  ఉన్న దుకాణదారులు ఫుట్ పాత్ ఆక్రమించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు  ఉన్నాయన్నారు.  దుకాణదారులతో ప్రమాదాలు బారిన పడకుండా, వాహనాల రాక పోకలకు అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించాలని వా రికి అవగాహనా కల్పించారు.

దుకాణ దారులు రోడ్డు ఆక్రమించి వస్తువులు ఏర్పాటు చేయటంతో రాకపోకలకు ఇబ్బంది కలిగి ప్రమాదాలు చోటు చేసుకుంటాయన్నారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా ఆచరించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు బే ఖాతార్ చేసినట్లైతే చట్టపరమైన చర్యలు చెప్పడతామని ఎస్త్స్ర హెచ్చరించారు.