calender_icon.png 25 May, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికులకు చట్టపరమైన అవగాహన కలిగి ఉండాలి

21-05-2025 12:00:00 AM

ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి వీ.శ్రీనివాస్

గద్వాల, మే 20 (విజయక్రాంతి): అసంఘటిత రంగంలోని కార్మి కులకు చట్టపరమైన అవగాహన కలిగి ఉండాలని ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి వి.శ్రీనివాస్ అన్నారు. మంగళ వారం గద్వాల్ మండలంలోని మదనపల్లి గ్రామంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సులో అసంఘటిత రంగంలోని కార్మికుల కొరకు ఉద్దేశించిన చట్టపరమైన అవగాహన సదస్సలో ముఖ్యఅతిథిగా ప్రిన్సిపల్ సీనియర్ సివి ల్ జడ్జి వి.శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అసంఘటిత కార్మికుల యొక్క సమ స్యలను అడిగి తెలుసుకున్నారు.అసంఘటిత కార్మికుల యొక్క చట్టాల గురించి వివరించా రు.అసంఘటిత రంగ కార్మికులు అంటే ప్రభుత్వంతో అధికారికంగా నమోదు కాని వ్యాపారాలో పని చేసే వ్యక్తులు, తరచుగా చట్టపరమైన,నియంత్రణ చట్టానికి వెలుపల పని చేస్తారు.

ఈ రంగం చిన్న వ్యాపారాలు నుండి ఇంటి ఆధారత పని వరకు విస్తృత శ్రేణి కార్యకలాపాలను కలిగి ఉంటుందని , ఎక్కువ మంది శ్రామిక శక్తిని కలిగి ఉంటుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ వి. రాజేందర్,బి. శ్రీనివాసులు,లక్ష్మణ స్వామి పాల్గొన్నారు.