calender_icon.png 25 May, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజుపేట పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పాయం,కలెక్టర్ జితేష్ వి.పాటిల్

21-05-2025 12:00:00 AM

మణుగూరు మే 20  (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల మున్సిపాలిటీ పరిధిలోని రాజుపేట గ్రామంలో పలు ప్రాంతాలను మంగళవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేష్ వి పాటేల్ పర్యటించి పర్యవేక్షించారు. అనంతరం రాజుపేట, విట్టల్ రావు నగర్  లో ఉన్న చెరువుని, సింగరేణి బ్లాస్టింగ్ వలన క్రాక్ చెందిన పలు ఇళ్లను పరిశీలించారు. 

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సింగరేణి బొగ్గు టిప్పర్లు, ఇసుక టిప్పర్లు, సింగరేణి డంపింగ్ నుంచి వచ్చే డస్ట్ కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు  వారి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామని  గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సింగరేణి అధికారులు,సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య   మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ , నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.