calender_icon.png 25 October, 2025 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యం, సామరస్యాలలో ఆహారం కీలకం

24-10-2025 12:00:00 AM

గీతంలో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవం

పటాన్ చెరు, అక్టోబర్ 23 : ఆరోగ్యం, స్థిరత్వం, ప్రపంచ సామరస్యాన్ని ప్రోత్సహిం చడంలో ఆహారం కీలక పాత్ర గురించి అవ గాహన పెంచే లక్ష్యంతో హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం ప్రపంచ ఆహార దినోత్సవం-2025ను ఘనంగా నిర్వహించారు. ప్రజలు, భూగోళాన్ని ఏకం చేసే ఆహారం యొక్క శక్తి ఇతివృత్తంగా ఈ కార్యక్రమాన్ని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని లైఫ్ సైన్సెస్ విభాగం ఏర్పాటు చేసింది.

ఈ వేడుకల ప్రారంభోత్సవంలో గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ మోతాహర్ రెజా, లైఫ్ సైన్సెస్ విభాగం అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలు, పోటీలలో విద్యార్థులు చురుకుగా పాల్గొని, విలువైన అనుభవాన్ని పొందాలని వారు విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.