24-10-2025 12:00:00 AM
గండిడ్, అక్టోబర్ 23: మండలం వెన్నచేడ్ గ్రామం లో తెలంగాణమాడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సందర్శించారు. మోడల్ పాఠశాలలోఆస్ట్రో ల్యాబ్ ను పరిశీలించారు ఉపాధ్యాయులతో ల్యాబ్ లో ఉన్న టెలీస్కోప్ మరియు పలు రకాల ప్రయోగాలు, గురించి ఏ విధంగా ఈ లాబ్ ను ఉయోగించవచ్చు అన్ని విషయాలు ఉపాధ్యాయుల ను అడిగి తెలుసుకున్నారు.
ఆస్ట్రో ల్యాబ్ ద్వారా శాస్త్ర సాంకేతిక ప్రయోగాల గురించి అవగాహన కల్పించి వాటి గురించి పూర్తిగా విద్యార్థులు తెలుసుకొనే విధంగా ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. అక్కడినుండి హెల్త్ కేర్ ల్యాబ్ ను పరిశీలించారు. విద్యార్థులకు ల్యాబ్ లో అందుతున్న సదుపాయాల గురించి కోర్సు అయిపోయిన తర్వాత వారి సర్టిఫికెట్ గురించి అడిగి తెలుసుకుంది. అక్కడనుండి మధ్యాహ్నం భోజనం చేస్తున్న విద్యార్థుల దగ్గరికి వెళ్లి భోజనం ఎలా ఉంది? భోజనం మంచిగానే ఉందా ఈరోజు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.. మిషన్ భగీరథ త్రాగు నీరు సరిపడ రావడం లేదని కలెక్టర్ కు వివరించారు.
మోడల్ పాఠశాల నుండి హాస్టల్ వరకు మిషన్ భగీరథ పైపులైన్ పొడిగించాలని మిషన్ భగీరథ ఎస్. ఈ కి సూచించారు.రంగారెడ్డి పల్లి వద్ద మిషన్ భగీరథ పైపులు డ్యామేజ్ కావడం తో 8 గ్రామాలకు 20 రోజులుగా త్రాగు నీరు సరఫరాలో ఇబ్బంది ఎదురవుతుందని గ్రామస్తులు తెలుపగా వారం రోజుల్లో సమస్య పరిష్కరించాలని సంబంధిత ఎస్.ఈ చల్మా రెడ్డి ని ఆదేశించారు. అనంతరం క్రీడా స్థలాన్ని పరిశీలించి క్రీడలు ఆడేందుకు అనువుగా క్రీడా స్థలాన్ని ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ నిధులతో క్రీడా స్థలాన్ని చదును చేయించడానికి,గ్రామం నుండి మోడల్ స్కూల్ వరకు సిసి రోడ్డును ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఈ కార్యక్రమం లో తహశీల్దార్ మల్లికార్జున్ ,ఇంచార్జి ఎం పి.డి.ఓ హరిశ్చంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.