calender_icon.png 27 July, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు రేషన్‌కార్డుతో ఆహార భద్రత

25-07-2025 12:46:10 AM

మహబూబాబాద్, జూలై 24 (విజయ క్రాంతి): పేదలకు రేషన్ కార్డుతో ఆహార భద్రత లభిస్తుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు.

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో  గురువారం నిర్వహించిన కార్యక్రమంలో పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులను ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు ఇంట్లో కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందజేస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి మారుపేరుగా నిలిచిన కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కూరెల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.