27-07-2025 07:04:30 PM
నిర్మల్ జిల్లా (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవిబాయి హాస్పిటల్(Devi Bai Hospital)లో ఆదివారం నూతన ఫర్టిలిటీ(IVF) సెంటర్ లాప్రోస్కోపిక్ సెంటర్లను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Alleti Maheshwar Reddy), ముధోల్ ఎమ్మెల్యే రామారావ్ పటేల్(MLA Ramarao Patel)లు ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ... నిర్మల్ లో ఇటువంటి కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం ఉంటుందని అన్నారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా వైద్య సేవలను అందుబాటులో తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ చంద్రిక డాక్టర్ అవినాష్ స్థానిక వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.