calender_icon.png 27 July, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ క్రికెట్ క్యాంపుకు బెల్లంపల్లి క్రీడాకారుడు ఎంపిక..

27-07-2025 06:50:33 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): హైదరాబాదులోని ఎమ్మెస్ కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ(MSK Prasad’s International Cricket Academy)లో ఇటీవల యూత్ స్టార్స్ క్రికెట్ లీగ్(వై.ఎస్.సి.ఎల్) ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ జోన్ క్రికెట్ ఎంపిక పోటీలలో అండర్-14 విభాగంలో బెల్లంపల్లి పట్టణానికి చెందిన రెడ్డి రిత్విక్ ఎంపికయ్యాడు. ఈ ఎంపిక పోటీలలో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక,కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ఎంపిక పోటీలలో రెడ్డి రిత్విక్ మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి తెలంగాణ క్రికెట్ క్యాంపుకు ఎంపిక అయ్యాడు. క్రికెట్ క్యాంపుకు రిత్విక్ ఎంపిక కావడంతో మూడు సంవత్సరాల పాటు స్పాన్సర్స్ షిప్ లభిస్తుంది. ఈ క్రికెట్ క్యాంపుకు ఎంపిక కావడం పట్ల రెడ్డి రిత్విక్ ను పలువురు సీనియర్ క్రీడాకారులు అభినందించారు.