calender_icon.png 27 July, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి

27-07-2025 06:58:22 PM

గిరిజనుల జోలికొస్తే సహించేది లేదు..

లంబాడ హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. బెల్లయ్య నాయక్..

కామారెడ్డి (విజయక్రాంతి): పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, లంబాడా కుల పోరాటం సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బెల్లయ్య నాయక్(President Dr. Bellaiah Naik) అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా(Kamareddy District) గాంధారి మండల కేంద్రంలో నిర్వహించిన గిరిజనుల సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనుల జోలికి వస్తే సహించేది లేదని అన్నారు. కామారెడ్డి జిల్లాలో పోడు భూములు సాగు చేసుకుంటున్నా గిరిజన రైతుల భూములను అటవీ అధికారులు గుంజుకోవడం తగదని అన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో తమ తండా తమరాజ్యం కావాలని లంబడా  హక్కుల పోరాట సమితి పోరాటం చేయడం వల్లనే రాష్ట్రంలో 3 వేల తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయి అన్నారు.

ప్రస్తుత ప్రభుత్వంలో గిరిజన గోరు భాషను ఎనిమిదవ షెడ్యూల్లో భారత రాజ్యాంగంలో నమోదు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయించిన ఘనత లంబడా హక్కుల పోరాట సమితి పోరాటం వల్లే సాధించుకున్నాం అన్నారు. గిరిజనులకు ఉన్న ఆరు శాతం రిజర్వేషన్లును 10% శాతం చేయాలని గత ప్రభుత్వా హాయంలో పోరాటం చేసి సాధించుకున్నట్లు తెలిపారు. ఐకమత్యంగా పోరాటం చేస్తే మనకు రావాల్సిన హక్కులు వస్తాయని అన్నారు. గిరిజనులకు ఏ సమస్య ఎదురైనా లంబాడాకుల పోరాట సమితి ముందుండి ప్రభుత్వంతో పోట్లాడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి గిరిజనులకు పోడు భూములు అందేలా కృషి చేద్దామన్నారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబల్ నాయక్, జాతీయ ప్రధాన కార్యదర్శి అన్న కోటయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ నాయక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ నాయక్, జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాట్రావత్ బద్రు నాయక్, లంబాడి హక్కుల యువజన విభాగం అధ్యక్షులు మోతిలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.