25-07-2025 12:44:09 AM
మహబూబాబాద్, జూలై 24 (విజయ క్రాంతి): ఆర్ ఓ ఎఫ్ ఆర్ హక్కుపత్రాలు కలిగి ఏళ్ల తరబడిగా సేద్యం చేసుకున్న ఆదివాసి రైతులకు అధికారులు సహకరించాలని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ముస్మి లో నిర్వహించిన పెసా కమిటీ తీర్మానించింది.
గురువారం పెసా కమిటీ ఉపాధ్యక్షుడు గట్టి రమేష్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఆదివాసి పోరాటయోధులు కొమరం భీం, బిర్సా ముండా, రాంజీ గోండ్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలను వేసి నివాళులర్పించారు.
గ్రామ సభకు ఐటీడీఏ పెసా కమిటీ సమన్వయ కర్త కొమరం ప్రభాకర్, ఎంపీ ఓ రామకృష్ణ, గ్రామస్తులు హాజరయ్యారు. ముస్లిం గ్రామ పంచాయతీ పరిధిలో చెరువులకు గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేయాలని, ఏజెన్సీలో గిరిజనేతర వలసలు అరికట్టాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు.