27-07-2025 07:00:54 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా(Suryapet District) తుంగతుర్తి ఆర్య వైశ్య సంఘ మండల అధ్యక్షులు ఈగ నాగన్న ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఆగస్టు 3న జరిగే వైశ్య రాజకీయ రణ భేరి విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం ఆర్యవైశ్య సంఘం నాయకులు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ, వైశ్య జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని, ఆర్యవైశ్య కార్పొరేషన్ కు 500 కోట్లు నిధులు ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు తాడికొండ సీతయ్య ,బండారు దయాకర్ ,ఓరుగంటి శ్రీనివాస్, తల్లాడ కేదారి ఈగలక్ష్మయ్య ,గోపారపు సత్యనారాయణ ,మా శెట్టి వెంకన్న ఓరుగంటి అశోక్, ఇరుకుల రాజేంద్రప్రసాద్ ఓరుగంటి సుభాష్, తల్లాడ శ్రీను, తల్లాడ నారాయణ ,బుద్ధ వీరన్న , బండారు నాగన్న, కాసం రమేష్ తల్లాడ బిక్షం తదితరులు పాల్గొన్నారు.