24-01-2026 03:56:52 PM
తెలంగాణ సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్
కామారెడ్డి,(విజయక్రాంతి): దేశం సురక్షితంగా ఉండాలంటే యువత దృఢంగా ఉండాలని తెలంగాణ సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్ అన్నారు. శనివారం తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో యువజన వారోత్సవాల్లో భాగంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ... దేశం సురక్షితంగా ఉండాలంటే యువత శారీరకంగా మానసికంగా ఆరోగ్యపరంగా దృఢంగా ఉండాలన్నారు.
మన జీవితంలో వాకింగ్, యోగ భాగము కావాలన్నారు. ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంజయ్య మాట్లాడుతూ స్వదేశీ భావన అనేది మన జీవితంలో బాగా కావాలన్నారు. టూ కిరణ్ సమన్వయకర్త డాక్టర్ ఎస్ నారాయణ గుప్తా మాట్లాడుతూ మనం వాడే వస్తువులు వ్యాపారాలలో స్థానిక స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల స్వాలంబన దిశగా తీర్చిదిద్ద పడుతుందన్నారు. యువతకు నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
ప్రతి ఇల్లు స్వదేశీ ప్రతి యువకుడు స్వదేశీ భావనలను కలిగి ఉండి విధి ఉత్పత్తుల బదులు స్వదేశం పతులను వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ డాక్టర్ జి సునీత, ప్రొఫెసర్ లు డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ సబిత, డాక్టర్ ప్రతిజ్ఞ, డాక్టర్ నాగరాజు, పిఆర్ఓ డాక్టర్ సరిత, డాక్టర్ రమాదేవి, నిరంజన్, శ్రీకాంత్ , డాక్టర్ పోతన్న, డాక్టర్ సునీల్, కనకయ్య, ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.