24-01-2026 03:48:47 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): బాలికల హక్కుల రక్షణ కల్పించడంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ముందుంటుందని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి నాగరాణి అన్నారు. శనివారం కామారెడ్డి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికల భద్రతను హక్కులను నిరంతరం సమాజంలో అవగాహన చేసి న్యాయ సౌలభ్యాన్ని అందిస్తుందన్నారు. ప్రతి బాలికకు సమాన అవకాశాలు అందించడం ద్వారా సమాజంలో సమానత్వం మహిళా సాధికారతను నిజంగా సాధించగలమని అన్నారు.
శారీరక, మానసిక ఆరోగ్యం బాలికల సమగ్ర అభివృద్ధికి పునాదిగా ఉంటుందన్నారు. మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే విద్యలో జీవితంలో విజయం సాధించగలరని అన్నారు. ప్రతి బాలికలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి నాయకత్వ గుణాలు వికసిస్తాయని అన్నారు. మహిళ సాధికారతకు నిజమైన మార్గమని తెలిపారు. పోక్సో చట్టం బాలికలను లైంగిక వేధింపులు దుర్వినియోగం హింస నుండి రక్షించడానికి రూపొందించ బడిన ముఖ్య చట్టమని అన్నారు. బాలికలపై జరిగే ఏ చిన్న వేధింపులు కూడా మౌనంగా భరించకూడదని అలాంటి ఘటనలు జరుగుతే వెంటనే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పోలీస్ హెల్ప్ లైన్ 15100, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు సమాచారం అందించాలని సూచించారు.
బాలికలు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను తెలుపాలని కోరారు. చట్టంపై అవగాహన కలిగి ఉండటం వల్ల భద్రతకు అత్యంత కీలకమని అన్నారు. డి ఎల్ ఎస్ ఏ, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్, సిడబ్ల్యుసి, విద్యాశాఖ మధ్య సమన్వయంతో బాలల కుల పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. బాలికల భద్రత హక్కుల పరిరక్షణ మరింత బలపడుతుందని తెలిపారు. ప్రమాదంలో ఉన్న జిల్లాలను గుర్తించడం బాల్య వివా బాధిత పిల్లలను రక్షణ కల్పించడం కేసుల్లో బాధితులకు చట్టపరమైన వైద్య మానసిక సాయం అందించడం పిల్లలను సురక్షిత వాతావరణంలో పునరావాసం చేయడంలో ఎంతో అంకితభావంతో పనిచేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి స్రవంతి, సి డబ్ల్యూ సి నెంబర్ స్వర్ణలత, మండల విద్యాశాఖ అధికారులు ఎల్లయ్య రమణారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, డిఎల్ఎసిఎస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి ఆధ్వర్యంలో నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్బంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, కామారెడ్డి లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టి. నాగరాణి, డీఎల్ఎస్ఎ సెక్రటరీ, కామారెడ్డి హాజరై చిన్నారుల హక్కులు, సమానత్వం, విద్య,మహిళల సాధికారతపై ప్రసంగించారు.
ఈ సందర్భంగా టి. నాగరాణి మాట్లాడుతూ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ బాలికల హక్కుల రక్షణలో ఎల్లప్పుడూ ముందుంటుంది. బాలికల రక్షణ చట్టం, బాలికల విద్యా హక్కులు వంటి చట్టాల అమలు, ఫ్రీ లీగల్ సలహాలు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బాలికల భద్రతను, హక్కులను నిరంతరం సమాజంలో అవగాహనా చేసి న్యాయసౌలభ్యాన్ని అందిస్తోంది. ప్రతి బాలికకు సమాన అవకాశాలు అందించడం ద్వారా సమాజంలో సమానత్వం మరియు మహిళా సాధికారతను నిజంగా సాధించగలం” అని అన్నారు.
అలాగే, శారీరక మరియు మానసిక ఆరోగ్యం బాలికల సమగ్ర అభివృద్ధికి పునాదిగా ఉంటుందని, మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే విద్యలో, జీవితంలో విజయం సాధించగలరని పేర్కొన్నారు. ప్రతి బాలికలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే, వారి లో ఆత్మవిశ్వాసం పెరిగి, నాయకత్వ గుణాలు వికసిస్తాయని, అదే మహిళా సాధికారతకు నిజమైన మార్గమని ఆమె తెలిపారు. POCSO చట్టం బాలికలను లైంగిక వేధింపులు, దుర్వినియోగం మరియు హింస నుంచి రక్షించడానికి రూపొందించబడిన ముఖ్యమైన చట్టమని తెలిపారు. బాలికలపై జరిగే ఏ చిన్న వేధింపును కూడా మౌనంగా భరించకూడదని, అలాంటి ఘటనలు జరిగితే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీస్ లేదా NALSA హెల్ప్ లైన్ 15100 లేదా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. బాలికలు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను తెలియజేయగలగాలని, చట్టంపై అవగాహన కలిగి ఉండటం వారి భద్రతకు అత్యంత కీలకమని అన్నారు.
DLSA, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్, CWC, విద్యా శాఖ మధ్య సమన్వయంతో బాలల హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని బాలికల భద్రత, హక్కుల పరిరక్షణ మరింత బలపడుతోందని తెలిపారు. ప్రమాదంలో ఉన్న చిన్నారులను గుర్తించడం, బాల్య వివాహ బాధిత పిల్లలను రక్షణ కల్పించడం, POCSO కేసుల్లో బాధితులకు చట్టపరమైన, వైద్య, మానసిక సహాయం అందించడం, అలాగే పిల్లలను సురక్షిత వాతావరణంలో పునరావాసం చేయడంలో ఎంతో అంకితభావంతో పనిచేస్తోందని ఆమె ప్రశంసించారు. కార్యక్రమంలో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి స్రవంతి, స్వర్ణలత, మండల విద్యాశాఖ అధికారులు ఎల్లయ్య , రమణ రెడ్డి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు, స్టాఫ్ , డీఎల్ఎస్ఏ సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు.