24-01-2026 03:51:26 PM
ఫైన్ లు, పెనాల్టీలు విధిస్తూ నోటీసులు జారీ చేయాలని ఆదేశం
జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగువాన్
కామారెడ్డి, జనవరి 24 (విజయక్రాంతి): జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు తప్పనిసరిగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ అన్నారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా వైద్యాధి కారులు, ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులతో సమావేశం నిర్వహించారు. యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకొని ఆస్పత్రు లను గుర్తించి జరిమానాలు, పెనాల్టీలు, విధించాలని నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్యాధికారి దివ్యను ఆదేశించారు.
రిజిస్ట్రేషన్ చేసుకుని ఆసుపత్రుల నివేదికలను డిఆర్ఏ కమిటీ సమర్పించాలన్నారు. జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ ఆమోదం మేరకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది ఆస్పత్రికి వచ్చిన రోగుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని అన్నారు. రోగులకు సరైన చికిత్స అందించాలని సూచించారు. రోగులనుంచి వసూలు చేసే ఫీజులు రిజిస్ట్రేషన్ సమయంలో డిఆర్ఏ కమిటీ సమర్పించిన ప్రైస్ లిస్ట్ ప్రొసీజర్ల ప్రకారమే వసూలు చేయాలని ఆదేశించారు. అనుమతి పొందిన ఆసుపత్రిలో డాక్టర్లు, ఇబ్బంది మార్పులు జరిగితే వాటిని తప్పనిసరిగా జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీకి తెలపాలన్నారు.
జిల్లా అడిషనల్ కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ సమాజంలో డాక్టర్లకున్న గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. మానవత దృక్పథంతో రోగులకు సేవలందించాలన్నారు. ఫీజుల విషయంలో స్పష్టత పాటించాలని సూచించారు. డాక్టర్లకి ఏవైనా సమస్యలు ఉంటే ఐఎంఈ అసోసియేషన్ ద్వారా జిల్లా కలెక్టర్కు ప్రతినిత్యం అందించవచ్చు అని తెలిపారు. జిల్లా వైద్యాధికారి విద్య మాట్లాడుతూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం నిబంధనలో లభించిన ఆసుపత్రులపై 50 వేల నుండి 5 లక్షల వరకు జర మన వేయించడంతోపాటు అవసరమైతే అలాంటి ఆసుపత్రిలో సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
కార్యాలయానికి స్కానింగ్ రిపోర్టులు సి సెక్షన్ రిపోర్ట్ అవసరమైన నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. కొన్ని ఆసుపత్రుల యజమాన్యాలు తామే రిపోర్టర్లు మని చెప్పుకొని పత్రికలు యూట్యూబ్ ఛానల్ పేరుతో అందరి ఇబ్బంది పెడుతున్నారు అని తెలిపారు. ఈ సమావేశంలో వైద్యాధికారులు శిరీష, డాక్టర్ వెంకటస్వామి, వేణుగోపాల్, చలపతి, ప్రైవేట్ ఆసుపత్రిలో యజమానులు వైద్యులు పాల్గొన్నారు.