calender_icon.png 24 January, 2026 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచమ్మ గడ్డ తాండలో ప్రజాబాట

24-01-2026 04:07:55 PM

జడ్చర్ల: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Jadcherla MLA Anirudh Reddy) ఆదేశాల మేరకు ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ అధికారులు జడ్చర్ల మండలం పోచమ్మ గడ్డా తండా(Pochamma Gadda Tanda) గ్రామ పంచాయతీలో శనివారం పర్యటించారు. ఏడీ చంద్రశేఖర్, ఏఈ వెంకటయ్య, లైన్‌మెన్లు రాధాకృష్ణ, బాలస్వామి, రాజారెడ్డి, జూనియర్ లైన్‌మెన్ సతీష్ పోచమ్మ గడ్డ తండా గ్రామ పంచాయతీలో ఉన్న కరెంట్ సమస్యలను తెలుసుకున్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులకు సర్పంచ్ కేతావత్ శ్రీకాంత్ నాయక్(Sarpanch Kethavath Srikanth Naik) తండాలోని సమస్యలను దగ్గరుండి వివరించారు. 

ఈ సందర్భంగా తండా ప్రజలు త్రీఫేజ్ కరెంట్, 24 గంటల విద్యుత్ సరఫరా కావాలని కోరగా, అందుకు సానుకూలంగా స్పందించి త్వరలో అమలు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో తండా వాసులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే లూజ్ కనెక్షన్లు సరిచేయడం, కరెంట్ స్తంబాలు లేని చోట కొత్త స్థంబాలు ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడం తండా అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని సర్పంచ్ పేర్కొన్నారు. తండా సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి ముందుకు వచ్చిన ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ అధికారులకు, సిబ్బందికి పోచమ్మ గడ్డ తండా ప్రజల తరఫున సర్పంచ్ శ్రీకాంత్ నాయక్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీజీటీ సర్పంచ్ కేతావత్ శ్రీకాంత్, బుక్కా వెంకటేశం మాజీ సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్ నేనావత్ రాజేష్, నేనావత్ చందర్ మాజీ వార్డు సభ్యుడు, కేతావత్ బాబ్య నాయక్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.