24-01-2026 04:14:48 PM
వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సిహెచ్ సతీష్ శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. పూర్వ విద్యార్థిగా ఉన్న సతీష్ గ్రామ సర్పంచ్ స్థాయికి ఎదగడంతో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం ఆయనను ఘనంగా అభినందించి సత్కరించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ కష్టపడి చదివితే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, సతీష్ సాధించిన విజయమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. సతీష్ మాట్లాడుతూ తన జీవితానికి బాట వేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.