calender_icon.png 24 January, 2026 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

24-01-2026 03:53:38 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ  మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ కొరకు ఎంపీడీవో కార్యాలయంలో ఆర్డీవో, తాహాసిల్దార్ , ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్ ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉండాలన్నారు. నామినేషన్ పక్రియ నుంచి ఎన్నికలు పూర్తి అయ్యే వరకు అప్రమత్తంగా ఉండి ,ఎన్నికల సంఘం నియమాల ప్రకారం ప్రశాంత వాతావరణంలో మునిపల్ ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ మహిపాల్ రెడ్డి, స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్, ఏం పి డి ఓ.సిబ్బంది పాల్గొన్నారు.