calender_icon.png 24 January, 2026 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ప్రతినిధులు అధికారుల శ్రమదానం

24-01-2026 04:24:45 PM

చేర్యాల: సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో శ్రమాధానం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం మాట్లాడుతూ... గ్రామంలో ప్రతి నెల చివరి శనివారం రోజున ప్రజలు అధికారులు ప్రజా ప్రతినిదులతో కలిసి శ్రమాదానం కార్యక్రమంను నిర్వహిచాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అందులో భాగంగానే ఈ శనివారం రోజున శ్రమాధానం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ షకీల్ అహ్మద్ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు మాజీ ఎంపీటీసీ సభ్యులు బూరుగు నరసింహులు, మాల మహానాడు సంఘం అధ్యక్షులు బొప్పే నాగయ్య, బోయిన రాంబాబు, కుక్కల గోపాల్, గ్రామపంచాయతీ సిబ్బంది అందరు కలిసి గ్రామంలోని బస్ స్టాండ్ కూడలి బ్యాంక్ నుంచి పశువుల ధవాఖాన వరకు రోడ్డును శుభ్రం చేశారు.