calender_icon.png 24 January, 2026 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఖానాపూర్ వాసి

24-01-2026 04:19:41 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ వాసి చింతామణి కృష్ణ స్వామి నియమితులయినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర రాజధాని లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ధ్రువీకరించారు. రాష్ట్రంలో ఉన్న ఫోటో వీడియో గ్రాఫర్ సంక్షేమం కోసం పాటుపడతానని కృష్ణస్వామి తెలిపారు. స్థానికంగా ఉన్న ఫోటోగ్రాఫర్స్ కృష్ణను అభినందించారు.