calender_icon.png 4 November, 2025 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణలీలకు కథే హీరో

04-11-2025 01:09:22 AM

యంగ్ హీరో దేవన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న సూపర్ నేచురల్ లవ్‌స్టొరీ ‘కృష్ణలీల’. ‘తిరిగొచ్చిన కాలం’అనేది ట్యాగ్‌లైన్. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది.  జ్యోత్స్న జీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు- అనిల్ కిరణ్‌కుమార్ జీ అందించారు. ఈ సినిమా నవంబర్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో, డైరెక్టర్ దేవన్ విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు. “-నేను రెండు సినిమాల్లో మంచి పాత్రలు చేశాను.

తర్వాత  నిర్మాత జోత్స్న, రైటర్ అనిల్ ఈ కథ చెప్పారు. వారం తర్వాత ఈ జనరేషన్‌కు ఈ కథను ఎలా చెప్పొచ్చో కొన్ని మార్పులు చేసి ఒక కొత్త రకం స్క్రీన్‌ప్లేతో చెప్పాను. నాకు డైరెక్షన్లో అనుభవం లేదు. కానీ కథ, స్క్రీన్‌ప్లేపై  అవగాహన ఉంది. అదే నమ్మకంతో డీవోపీ చోటా కే నాయుడుని కలిశాను. కథ విని, చాలా ఎక్సైట్ అయ్యారు.   మనిషి కాలాన్ని వెనక్కి తిరిగి తీసుకురాలేడు. కానీ, దైవత్వంతో కాలం మళ్లీ తిరిగి వస్తే ఎలా ఉంటుందనేది చాలా ఆసక్తికరంగా చూపించాం.

ఈ జన్మలో నీతో ప్రయాణించే ప్రతి వ్యక్తి గత జన్మలో నీతో అనుబంధం కలిగి ఉంటారు. వాళ్లకు ప్రేమను పంచమని భగవద్గీత చెప్తుంది. ఇందులో ఆ అంశాన్ని చాలా కొత్తగా చూపించాం. చాలా నిజాయితీ ఉన్న కథ ఇది. కథనే హీరోగా నమ్ముకున్నా” అని చెప్పారు.