calender_icon.png 4 November, 2025 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంట్లోనే డ్రగ్స్ దందా.. డాక్టర్ జాన్ పాల్ అరెస్ట్

04-11-2025 12:07:14 PM

హైదరాబాద్: నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. వైద్యుడి ఇంట్లో రూ. 3 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ శాఖ ప్రకారం, జాన్ పాల్ అతని స్నేహితులు ప్రమోద్, సందీప్, శరత్ బెంగళూరు, ఢిల్లీ నుండి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయిస్తున్నాడు. వైద్యుడి ఇంట్లో డ్రగ్స్ సమాచారంతో ఎక్సైజ్ ఎస్ టీఎఫ్ సోదాలు నిర్వహించి పట్టుకున్నాయి. డాక్టర్  జాన్ పాల్(Hyderabad doctor arrested) మూషీరాబాద్ లోని ఇంట్లో అద్దెకు ఉంటూ డ్రగ్స్ అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కు చెందిన ప్రమోద్, సందీప్, శరత్ ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్నారు.

దిగుమతి చేసుకున్న డ్రగ్స్ ను డాక్టర్ జాన్ పాల్ నివాసంలో ఉంచి విక్రయిస్తున్నారు. నిందితుడైన డాక్టర్‌ను ముషీరాబాద్ నివాసి జాన్ పాల్‌గా గుర్తించారు. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఆ ఇంటిపై దాడి చేసి 26.95 గ్రాముల గంజాయి, 6.21 గ్రాముల ఎండీఎంఏ, 15 ఎల్ఎస్డీ స్టిక్స్, 1.32 గ్రాముల కొకైన్, 5.80 గ్రాముల గమ్మస్, 0.008 గ్రాముల హాషిష్ ఆయిల్ వంటి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. తెనాలి వాసి అయిన జాన్ పాల్ గాంధీ ఆస్పత్రిలో ఫోరెన్సిక్ స్పెషాలిటీలో పీజీ చదువుతున్నాడు. నిందితులు డ్రగ్స్ విక్రయించినందుకు జాన్ పాల్ కు ఉచితంగా డ్రగ్స్ ఇస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.