8 August, 2026 | 1:17 AM

బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు ఫోరెన్సిక్ సైన్స్ సెమినార్

08-08-2026 12:00 AM

బోధన్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల వరకు ఫోరెన్సిక్ సైన్స్పై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు. ఈ సెమినార్లో ప్రోబెలాబ్ ఫోరెన్సిక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ మోహన్ ఎర్రగొల్ల ముఖ్య వక్తగా పాల్గొని పత్రాల పరిశీలన, వేలిముద్రల విశ్లేషణ, ప్రామాణికత నిర్ధారణ, సైబర్ ఫోరెన్సిక్స్, సంఘటనా స్థల పునర్నిర్మాణం తదితర అంశాలపై న్యాయవాదులకు అవగాహన కల్పించనున్నారు.

ఈ కార్యక్రమాన్ని  5వ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి సతీమణి ప్రారంభించనుండగా,  సీనియర్ సివిల్ జడ్జి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఫోరెన్సిక్ సైన్స్కు సంబంధించిన ఆధునిక అంశాలపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు బోధన్ బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని అధ్యక్షులు కోరారు.