సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం
08-08-2026 12:00 AM
- 15 రాష్ట్రాల్లోని 49మంది అరెస్ట్
- రూ.98.89 లక్షలు బాధితులకు అందజేత
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): సైబర్ నేరస్థులపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు 15 రాష్ట్రాల్లోని సైబర్ ముఠా నెట్‌వర్క్‌లను చేధించి 49మందిని కటకటాల్లోకి నెట్టారు.
వారి నుంచి రూ. 98.89 లక్షలను రికవరీ చేసి బాధితులకు అందించారు. జూలైలో 70 సైబర్ కేసులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, ట్రేడింగ్ మోసాలు అత్యధికంగా ఉన్నాయన్నారు. 29 మందిని అరెస్టు చేశామని, 25 డెబిట్‌కార్డులు, 23 మొబైల్ ఫోన్లు, 3 ల్యాప్‌ట్యాప్‌లు సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జోనల్ సైబర్‌సెల్స్‌లో 298 కేసులు నమోదు కాగా ఆరుగురిని అరెస్టు చేశామని, 128 నకిలీప్రొఫైళ్లు, 36 నకిలీ యాడ్‌లను బ్లాక్‌చేశామన్నారు.






