calender_icon.png 30 July, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరుతను పట్టుకోవడంలో అటవీశాఖ విఫలం

29-07-2025 11:40:55 PM

- రైతులు, గొర్రెల కాపరుల పై చిరుత దాడి చేసింది. ఎవరు బాధ్యత వహిస్తారు..?

- టీడీగుట్ట వీరన్నపేట ప్రాంతంలో చిరుత సంచార ప్రాంతము సందర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): జిల్లాలో చిరుత పుల్లు సంచరిస్తున్న అటవీశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలు సక్రమంగా లేవని మాజీమంత్రి వి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని టీడీ గుట్ట, వీరన్నపేట ప్రాంతాలలో చిరుత సంచారం చేసిన పలు ప్రాంతాలతో పరిశీలిస్తూ అక్కడ ప్రజలకు భరోసానిస్తూ మాట్లాడారు. కోయిలకొండ మండలం కొత్తలాబాదుకు చెందిన రైతులు, గొర్రెల కాపరులపై చిరుత దాడి చేసిన అధికారులు ఎందుకు చర్యలు వేగవంతంగా తీసుకోవడం లేదని విమర్శించారు. టీ డీ గుట్ట.. వీరన్నపేటలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని, ఏదైన జరిగితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటదన్నారు. శాఖల మధ్య సమన్వయము కనిపించడం లేదని, శాఖల అధికారులు సమన్వయము చేసుకొని చిరుతను పట్టుకోవాలన్నారు.

అటవీ శాఖ సిబ్బంది తక్కువ తక్కువగా ఉంటే వేరే ప్రాంతం నుంచి తెప్పించాలన్నారు. అవసరం అయితే పోలీస్ సిబ్బందిని తీసుకోవాలన్నారు. ఇక్కడ చిరుతను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన రెండు బోన్ లలో ఒక్కటి వేరే ప్రాంతానికి తీసుకువెళ్లారని, కనీసం బోన్లు కూడా లేని పరిస్థితి ఉందని తెలిపారు.  =రెండు చిరుతలు ఉన్నాయని స్థానికులు చెబుతుంటే వెంటనే అధికారులు పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఆందోళన చెందుతున్నారని, వెంటనే చిరుత పట్టుకోవడంతో పాటు ప్రజలకు ఒక భరోసా,  దైర్యం కల్పించాలన్నారు.మళ్ళీ అడవిలో నుంచి జంతువులు బయటకి రాకుండా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ధైర్యంగా ఉండాలని ఎవరు కూడా ఒంటరిగా రాత్రి వేళలో బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ముడా చైర్మన్ గంజి వెంకన్న, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు శివరాజ్ తదితరులు ఉన్నారు.