calender_icon.png 30 July, 2025 | 1:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్బంధ తనిఖీలు

29-07-2025 11:45:04 PM

- నాలుగు బెల్టు షాపుల గుర్తింపు, నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

- అక్రమ గుట్కా, పొగాకు ఉత్పత్తుల స్వాధీనం..

గచ్చిబౌలి (విజయక్రాంతి): మాదాపూర్ పోలీస్ స్టేషన్(Madhapur Police Station) పరిధిలోని సిద్దిక్ నగర్ లో డీసీపీ వినీత్ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమంగా నడుస్తున్న నాలుగు బెల్టు షాపులను గుర్తించి 1 లక్ష 20 వేల విలువగల 305 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని నలుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఐదు ఇళ్లలో నిల్వ ఉంచిన 10 లక్షల విలువగల గుట్కా, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకొని యజమానులపైన కేసులు నమోదు చేసారు.

షాపులలో అక్రమంగా నిల్వ ఉంచిన 21 పెద్ద సిలిండర్లు, 20 చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, చట్టవిరుద్ధంగా ఎల్పీజీ గ్యాస్ రీఫిల్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో సరియైన పత్రాలు లేని 48 వాహనాలను స్వాధీనం చేసుకొని చలాన విధించడం జరిగిందని డీసీపీ వినీత్ తెలిపారు. ఈ నిర్బంధ తనిఖీల్లో మాదాపూర్ డీసీపీ వినీత్, అదనపు డీసీపీ ఉదయ్ రెడ్డి, మాదాపూర్ ఎసిపి శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్ తో పాటు 11 మంది ఇన్స్పెక్టర్లు, 25 మంది ఎస్ఐలతో పాటు మొత్తం 275 మంది సిబ్బంది పాల్గొన్నారు.