30-07-2025 12:00:00 AM
భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు
తిమ్మాపూర్ జూలై 29 విజయ క్రాంతి: నాగుల పంచమి పురస్కరించుకొని మంగళవారం మహిళలు భక్తిశ్రద్ధలతో నాగదేవతలను వేడుకొని పూజలు చేశారు. తిమ్మాపూర్ మండలంలోని మహాత్మ నగర్ లో గల శ్రీ శ్రీ తాపల లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలో గల నాగదేవత ఆలయంలో జంట దేవతలకు పాలు పోసి పసుపు, కుంకుమ,లతో అలంకరించి నైవేద్యం సమర్పించారు.
ఉపవాస దీక్షలు ఆచరించిన మహిళలు పాము పుట్టల వద్ద పసుపు కుంకుమలతో పాటు రంగురంగుల పువ్వులతో జంట దేవతలను అలంకరించి అమ్మవారికి మనస్ఫూర్తిగా మొ క్కులు చెల్లించుకున్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడి సకలజనులతో పాటు రైతులు గొడ్డు గోదా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు.
నాగుల పంచ మి సందర్భంగా ఎల్ ఎండి కాలనీలో గల శ్రీ మృత్యుంజయ మహాదేవాలయం, శ్రీ వెంకటేశ్వ ర స్వామి, ఆలయలతో పాటు పలు గ్రామాలలో ఉన్నటువంటి ఆలయాలలో భక్తులు ఉదయం నుంచి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి స్వామివార్లను చల్లగా చూడమని వేడుకున్నారు.
పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ తాపాలా లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, సభ్యులు నేదునూరి గంగరాజం, తో పాటు అర్చకులు పురుషోత్తం, ప్రధాన అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, శ్రీకాంత్ చార్యులు, పాటు ఆయా దేవాలయాల అర్చకులు కమిటీ సభ్యులుపాల్గొన్నారు.