calender_icon.png 8 January, 2026 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో అటవీ అధికారులు

04-01-2026 12:00:00 AM

  1. జామాయిల్ కటింగ్ బిల్లు కోసం లంచం డిమాండ్ 
  2. రూ.3.51 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిన అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం జనవరి 3 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శనివారం ఏసీబీ దాడులు నిర్వహించారు. ఫారెస్ట్ డివిజనల్ మేనేజర్, ప్లాంటేషన్ మేనేజర్ 3.51 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వై రమేష్ తెలిపిన వివరాల మ్రేరకు టీఎఫ్‌డీసీ ప్లాంటేషన్ మేనేజర్ (ఫారెస్టు రేంజ్ అధికారి) తాడి రాజేందర్, డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణ్ కాంట్రాక్టర్ వద్ద నుంచి జామాయిల్ కట్ చేసిన బిల్లులు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేశారు.

32 వేల టన్నులు టన్నుకు రూ 28. 80 లక్షలు లంచం డిమాండ్ చేశారు. టన్నుకు రూ 750 ప్రభుత్వం ఇస్తుంది.. 150 డిమాండ్ చేసి,రూ 90 బేరం కుదిరింది. మొదటి యూనిట్ లో 3900 టన్నులు కటింగ్ అయింది ఆ బిల్లులు చేసేందుకు.రూ 3 .51 లక్షలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో లంచం తీసుకుంటున్న ఫారెస్ట్ అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.