calender_icon.png 19 January, 2026 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ కౌన్సిలర్

19-01-2026 05:36:11 PM

నిర్మల్: పట్టణంలో (13వ  వార్డ్) శాస్త్రీనగర్ కాలనీ తాజా మాజీ కౌన్సిలర్ తులసి నర్సగౌడ్ తో పాటు కాలనీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు నేడు కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి గారు వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల్ మున్సిపాలిటీ పై కాషాయ జెండా ఎగరేసేవిధంగా ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని మహేశ్వర్ రెడ్డి గారు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, మాజీ కౌన్సిలర్ భూపతి రెడ్డి, BJYM జిల్లా అధ్యక్షులు ఒడిసెల అర్జున్ తో పాటు పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.