మిలాద్ -ఉన్ -నబీ వేడుకలో మాజీ కార్పొరేటర్ ముద్దం
27-08-2026 12:04 AM
సికింద్రాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సుఖ శాంతులతో, సోదరభావంతో జీవించాలని మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆకాంక్షించారు. ఓల్ బోయిన్పల్లి డివిజన్ లో మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఓల్ బోయిన్ పల్లిలో నిర్వహించిన ఉర్సు ఉత్సవాల్లో మాజీ కార్పొరేటర్ ముద్దం న ర్సింహ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భ ంగా మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ చూపిన శాంతి, సోదరభావం,మానవతా వి లువలు సమాజానికి ఆదర్శమని ముద్దం న రసింహ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇర్ఫాన్, సలీం, అజీమ్, ఇబ్బు, వసీం, హరీఫ్, హరినాథ్, పార్టీనాయకులు, ముస్లిం మత పెద్దలు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.






