27 August, 2026 | 3:45 AM

నిండు ఆరోగ్యంతోనే సంపూర్ణ జీవితం

27-08-2026 12:03 AM

పదేపదే పొటాషియం తగ్గుతుంటే అశ్రద్ధ వద్దు 

29 ఏళ్ల యువకుడిలో షోగ్రెన్స్ సిండ్రోమ్ నిర్ధారణ

40 శాతానికి పడిపోయిన గుండె పంపింగ్ సామర్థ్యం 65 శాతానికి పెంపు

మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న మలక్‌పేట్ యశోదా వైద్యులు

మహబూబ్నగర్ అర్బన్ ఆగస్టు 27: సంపూర్ణ ఆరోగ్యంతోనే నిండు జీవితం సాధ్యం అవుతుందని...జ్వరం, దగ్గు, ఆయాసం సాధారణ ఇన్ఫెక్షన్ లక్షణాలేనని నిర్లక్ష్యం చేస్తే కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితికి దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గద్వాల జిల్లా రాజోలికి చెందిన 29 ఏళ్ల సందెపోగు సుధాకర్ తీవ్ర జ్వరం, దగ్గు, ఆయాసంతో మలక్పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రాగా, పరీక్షల్లో రెండు ఊపిరితిత్తుల్లో న్యుమోనియా, టైప్-I రెస్పిరేటరీ ఫెయిల్యూర్, సెప్టిక్ షాక్, పల్మనరీ ఎడిమాతో కూడిన గుండె వైఫల్యంతో పాటు తీవ్రమైన హైపోకలీమియా ఉన్నట్లు వైద్యులు గుర్తించడం జరిగిందని, గుండె పంపింగ్ సామర్థ్యం కూడా 40 శాతానికి పడిపోయిందన్నారు. 

యువకుడిలో పదేపదే పొటాషియం తగ్గుతుండటాన్ని కీలక సూచనగా భావించిన క్రిటికల్ కేర్ బృందం అప్పటివరకు గుర్తించని షోగ్రెన్స్ సిండ్రోమ్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయినదాన్నారు. ఈ వ్యాధి మూత్రపిండాలను ప్రభావితం చేసి పదేపదే పొటాషియం తగ్గడానికి కారణమవుతుందని వైద్యులు తెలిపారు.

క్రిటికల్ కేర్ హెచ్‌ఓడీ డా. కళాధర్ ఎస్. నేతృత్వంలో ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డా. ఉగంధర్ భట్టు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. పవన్ పొద్దార్, నెఫ్రాలజిస్ట్ డా. సుధాకర్ జి., రుమటాలజిస్ట్ డా. నీలాద్రి భౌమిక్ బృందం సమన్వయంతో చికిత్స అందించింది. ఎన్‌ఐవీ ఆక్సిజన్ సపోర్ట్, యాంటీబయాటిక్స్, పల్మనరీ ఎడిమా చికిత్స, పొటాషియం సవరణ తదితర సమగ్ర వైద్యసేవలతో రోగి కోలుకున్నాడు. చికిత్స అనంతరం గుండె పంపింగ్ సామర్థ్యం 40 శాతం నుంచి 65 శాతానికి మెరుగుపడిందన్నారు.

జ్వరం, ఆయాసం, తీవ్రమైన బలహీనతతో పాటు పదేపదే పొటాషియం తగ్గడం లేదా ఆరోగ్యం వేగంగా క్షీణించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదని యశోదా ఆసుపత్రి డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కె. శ్రీనివాస్ రెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర సూచించారు. అత్యాధునిక క్రిటికల్ కేర్, డయాగ్నస్టిక్ సదుపాయాలు, బహుళ విభాగాల నిపుణుల సమన్వయంతో ఇటువంటి క్లిష్టమైన మల్టీ ఆర్గాన్ ఎమర్జెన్సీలకు సమగ్ర చికిత్స అందించగలుగుతున్నామని తెలిపారు.