3 September, 2026 | 11:29 AM

సీఎఫ్‌ఐలపై ప్రపంచబ్యాంక్ చొరవ

08-06-2024 | 01:22am

వరల్డ్ బ్యాంక్ నిఫుణులతో ఐసీబీఏ, ఐసీఏ ప్రతినిధి బృందం చర్చలు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (విజయక్రాంతి): ప్రపంచబ్యాంకులోని సీనియర్ ఫైనాన్సియల్ సెక్టార్ నిపుణులతో అమెరికా ఇంటర్నేషనల్ కోఢూనఆపరేటివ్ బ్యాంకింగ్ అసోసియేషన్ (ఐసీబీఏ), ఇంట ర్నేషనల్ కోఢూఆపరేటివ్ అలయన్స్ (ఐసీఏ) ప్రతినిధి బృందం ఈ నెల 5న చర్చలు జరిపింది. ఈ ప్రతినిధి బృందంలో టీఎస్ క్యాబ్ డైరెక్టర్, చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, ఐసీబీఏ, ఐసీఏ బోర్డు సభ్యులు భీమా సుబ్రహ్మణ్యం, ఐసీబీఏ బోర్డు సభ్యులు కబీర్ అయిండే తుకూర్, ఎన్‌సీబీఏ క్లుసా, వాషింగ్టన్, ఐసీఏ బోర్డు సభ్యులు డగ్లస్ ఓబ్రియన్, ఎన్‌సీబీ క్లుసా సీనియర్ అడ్వైజర్ మేరీ గ్రిఫిన్, ఐసీఏ బ్రస్సల్స్ ప్రతినిధి సంతోష్‌కుమార్, ఐసీఏ అమెరికాస్, రీజినల్ డైరెక్టర్ డానిలోసాలెర్నో తదితరులు పాల్గొన్నారు. సీఎఫ్‌ఐల పట్ల ప్రపంచబ్యాంకు చొరవను అర్థం చేసుకోవడమే ఈ సందర్శన లక్ష్యమని టీఎస్‌సీఏబీ అసిస్టెంట్ మేనేజర్ నారాయణ తెలిపారు. భారత్‌లోని సహకార బ్యాంకులు, ప్రపంచంలోని సీఎఫ్‌ఐలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ప్రపంచబ్యాంకు నుంచి మద్దతు పొందే అవకాశాన్ని అన్వేషిచడమేనని చెప్పారు. 2025ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా జరుపుకోవాలని సూచించారు.