calender_icon.png 23 November, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు

23-11-2025 09:11:45 PM

సిద్దిపేట (విజయక్రాంతి): పోలీస్ అధికారిగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శిగా పనిచేసి ఎంతోమంది నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపిన జ్ఞాన యోధుడు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినం జరపడం సంతోషకరంగా ఉందని ప్రోగ్రెసివ్ పేరెంట్ లీగ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మెట్ల శంకర్ అన్నారు. అనేకమంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో స్థిరపడే విధంగా తీర్చిదిద్దిన ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు దక్కుతుందని, వేల మంది విద్యార్థులు విదేశాలలో ఉపాధి పొందే విధంగా కృషిచేసిన ప్రవీణ్ కుమార్ కు రుణపడి ఉంటామని మెట్ల శంకర్ అన్నారు. ఆదివారం సిద్దిపేట స్వేరోస్ నెట్వర్క్, పిపిఎల్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిపిఎల్ జిల్లా ఉపాధ్యక్షులు పొన్నాల నర్సింహులు, ప్రతినిధులు ఎస్ ఎల్లయ్య, శంకర్, ఆయుష్ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.