ఇందిరమ్మ ఇండ్లు దేవుడిచ్చిన వరం
కలెక్టర్ ఆశిష్ సంగువాన్
కామారెడ్డి, మే 14 (విజయక్రాంతి) : ఇల్లు దేవుడిచ్చిన వరమని, ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ గ్రామం వార్డ్ నెంబర్ 1 లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మార్కవట్, ముగ్గు పోశారు. అనంతరం లింగంపేట మండలం ముస్తాపూర్ గ్రామంలో జూకంటి అనేటకు ఇందిరమ్మండ్ల నిర్మాణానికి మార్పు ఇచ్చి భూమిపూజ నిర్వహించారు.
తొలుత భూమి పూజ చేసి మంజూరు ఉత్తర్వులు కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో అదనపు రెవెన్యూ కలెక్టర్ విక్టర్ సబ్ కలెక్టర్ కిరణ్మయి భూభారతి ప్రత్యేక అధికారి రాజేందర్ పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్ ,జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మల్లికార్జున బాబు, తాసిల్దార్ సురేష్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, హౌసింగ్ పిడి జైపాల్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కుమ్మరి మహేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రతి మహిళను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం : కామారెడ్డి కలెక్టర్
కామారెడ్డి, మే 14 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లాలో మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రతి మహిళా ను కోటీశ్వరురాలు చేయాలని ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగువాన్ తెలిపారు. 2024- 25 సంవత్సరంలో జిల్లాలోని 11,668 సంఘాలకు 802 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజి ద్వారా ఋణాలను అందజేసినట్లు తెలిపారు.
జిల్లా మహి ళా సమాఖ్య అధ్యక్షురాలు, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జ్ఞాపికతోపాటు ప్రశంసా పత్రాన్ని బుధవారం తన ఛాంబర్‌లో అందజేశారు. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్క సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం కూడా వచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.






