calender_icon.png 1 January, 2026 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లోకి కేసముద్రం మార్కెట్ మాజీ చైర్మన్ దంపతులు..?

01-01-2026 12:23:36 AM

బీఆర్‌ఎస్ గట్టి దెబ్బ 

కేసముద్రం, డిసెంబర్ 31 (విజయక్రాంతి): మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బీఆర్‌ఎస్ లో కీలక నేతగా వ్యవహరిస్తున్న కేసముద్రం మార్కెట్ మాజీ చైర్మన్ నీలం సుహసిని దుర్గేష్ దంపతులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. జనవరి 2న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆయన తన అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే కనుక జరిగితే మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి దెబ్బగా మారనుందని చెబుతున్నారు.

ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న దుర్గేష్ తనతోపాటు కొంతమంది బీఆర్‌ఎస్ నేతలు, అనుచరులైన ముదిరాజ్ సంఘం నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కేసముద్రం మండలంలో మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ కు ప్రధాన అనుచరుడిగా నీలం దుర్గేష్ ఇప్పటివరకు కొనసాగుతున్నారు. మండలంలో గత కొంతకాలంగా బీఆర్‌ఎస్ పార్టీకి పెద్దదిక్కుగా దుర్గేష్ నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బీఆర్‌ఎస్ ను వదిలి కాంగ్రెస్ కండువా కప్పుకుంటే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ కు గడ్డు కాలమేననే ప్రచారం సాగుతోంది.