26-11-2025 06:33:47 PM
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రూ.50వేల కోట్ల పవర్ స్కామ్ కు తెరలేపిందని, రూ.50వేల కోట్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 30, 40 శాతం కమీషన్లు తీసుకుంనేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీమంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) మీడియా సమావేశంలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసినా ఒక మిషన్ ఉంటుందని.. ఆ మిషనే కమీషన్ అని తెలిపారు. కమీషన్లు ఎలా కొల్లగొట్టాలని మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తుందని, వాటాల పంపిణీ విషయంలో మంత్రులు ఘర్షణ పడుతున్నారన్నారు.
మంత్రుల కుటుంబ సభ్యులే బయటకు వచ్చి వాటాల అంశంపై చెబుతున్నారని, వాటాల్లో తేడాల వల్లే మంత్రులు బయటకు వచ్చి విమర్శించుకుంటున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అరాచకాలకు కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తోందని.. వాటాలు, కమీషన్ల కోసమే కేబినెట్ మీటింగ్ లు నిర్వహిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్, డర్టీ పాలిటిక్స్ చేస్తోందని.. కాంగ్రెస్ నేతల జేబుల్లోకి ప్రజాధనం వెళ్తుందని అన్నారు. మంత్రివర్గం స్కీమ్ ల గురించి కాదు.. స్కాముల గురించి ఆలోచిస్తుందని అన్నారు.