calender_icon.png 26 November, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారులు పోచారం

26-11-2025 06:01:32 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను బుధవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ పట్టణంలో రూ 37.50 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఏరియా ఆసుపత్రి పనులను త్వరగా నాణ్యతతో పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్ కు ఆదేశించారు. ఇప్పటివరకు ఎంతవరకు పూర్తయింది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కాంగ్రెస్ నాయకులు యండి. దావూద్, అలిమొద్దీన్ బాబా, నర్సగొండ, గౌస్, తదితరులు పాల్గొన్నారు.